రేవంత్ రెడ్డికి శుభ సంకేతాలు.!

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

నూతన సంవత్సరంలో వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయని, రైతులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ప్రముఖ పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయ రంగానికి మేలు జరిగే సూచనలు ఉన్నాయని, రైతులు సంతోషంగా ఉంటారని ఆయన విశ్లేషించారు.

పంచాంగ శ్రవణంలో భాగంగా మాట్లాడిన ఆయన, వర్షపాతం అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పసుపు వంటి పంటలకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వ్యవసాయ రంగంలో కొంతమేర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద రైతులకు లాభదాయకంగా మారే సంవత్సరం అవుతుందని చెప్పారు.

రాజకీయ పరంగా కూడా ఈ ఏడాది స్థిరత్వం ఉంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనాపరంగా పెద్దగా ఇబ్బందులు ఎదురుకావని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ రాష్ట్రం ముందుకు సాగుతుందని తెలిపారు.

ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు నూతన బాధ్యతలు, పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ, సామాజిక రంగాల్లో మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నప్పటికీ, సమగ్ర అభివృద్ధి దిశగా ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు.

ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ప్రజలు హాజరై కొత్త సంవత్సర ఫలితాలను ఆసక్తిగా విన్నారు.

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this