పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రమాదాలను నివారించే ఉద్దేశ్యంతో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ బి. ప్రణయ్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతించబోమని వెల్లడించారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రతిరోజు ఉదయం స్థానిక మావల వైపు నుండి వచ్చే వాహనాలు తిరుమల పెట్రోల్ బంక్ వరకు, అలాగే రైల్వే స్టేషన్ వరకు, ఆర్టీవో కార్యాలయం రైల్వే గేటు నుండి ‘ఐ లవ్ ఆదిలాబాద్’ వరకు పట్టణ పరిధిలో పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లో ఉంటాయని వివరించారు.

ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ట్రాఫిక్ సీఐ బి. ప్రణయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Latest articles

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి  నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్...

More like this