‘సీతారామం’ కాంబినేషన్ మళ్లీ రిపీట్? సీక్వెల్ ప్రచారానికి కారణమైన వైరల్ ఫోటో

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:
నాలుగేళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న క్లాసిక్ హిట్ ‘సీతారామం’ సినిమా కాంబినేషన్ మరోసారి తెరపైకి రాబోతోందా అనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తాజాగా వర్షంలో ఒకే గొడుగు కింద ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఈ ఫోటో చూసిన పలువురు అభిమానులు ‘సీతారామం’కి సీక్వెల్ రాబోతోందేమోనని ఊహాగానాలు మొదలుపెట్టారు. ఇప్పటికే భావోద్వేగ ప్రేమకథగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఈ సినిమా కాంబినేషన్ మళ్లీ కనిపించడమే ఈ ప్రచారానికి బలాన్నిచ్చింది.

అయితే, గతంలో దుల్కర్ సల్మాన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘సీతారామం’ వంటి క్లాసిక్ సినిమాలకు కొనసాగింపు ఉండదని, అలాంటి చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అయిన ఫోటో కొత్త సినిమా షూటింగ్‌కు సంబంధించినదా? లేక కేవలం యాదృచ్ఛికంగా తీసినదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఏదేమైనా, ‘సీతారామం’ కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపిస్తే చూడాలని అభిమానులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

Latest articles

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

More like this