‘సీతారామం’ కాంబినేషన్ మళ్లీ రిపీట్? సీక్వెల్ ప్రచారానికి కారణమైన వైరల్ ఫోటో
మన భారత్, తెలంగాణ: నాలుగేళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న క్లాసిక్ హిట్ ‘సీతారామం’ సినిమా కాంబినేషన్ మరోసారి తెరపైకి రాబోతోందా అనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తాజాగా వర్షంలో ఒకే గొడుగు కింద ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఫోటో చూసిన పలువురు అభిమానులు ‘సీతారామం’కి సీక్వెల్ రాబోతోందేమోనని ఊహాగానాలు...