ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు!

Published on

-Advertisement-

ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు!

మన భారత్, న్యూఢిల్లీ: 

దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదిక కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి సంప్రదాయ ప్రసంగం చేయనున్నారు.

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఆదివారం రోజున రాజ్యసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఉండనున్నాయని అంచనాలు ఉన్నాయి.

ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానానికి సంబంధించిన ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ బిల్లుపై విస్తృత చర్చ జరగనుంది. అదేవిధంగా 30 రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి సహా మంత్రులను పదవుల నుంచి తొలగించే విధానానికి సంబంధించిన బిల్లుపై కూడా సభల్లో చర్చ జరగనుందని సమాచారం.

ఈ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందితే దేశ రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈసారి బడ్జెట్ సమావేశాలు రాజకీయంగా, విధానపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని భావిస్తున్నారు.

Latest articles

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...

గుడుంబా అక్రమ మద్యం స్వాధీనం..

మన భారత్, ఆదిలాబాద్ 14 ద్విచక్ర వాహనాలు సీజ్ ఆదిలాబాద్, జూలై 20:ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన...

More like this

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...