అసెంబ్లీకి కేసీఆర్.. చర్చలో పాల్గొంటారా.?

Published on

అసెంబ్లీకి కేసీఆర్.. చర్చల్లో పాల్గొంటారా? లేక వెంటనే వెళ్లిపోతారా?

మన భారత్, హైదరాబాద్:
సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా? సభలో కీలక చర్చల్లో పాల్గొంటారా.? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నాయకులు మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను గట్టిగా ఎండగడతారని స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికే ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. సోమవారం ఉదయం నందినగర్‌లోని తన నివాసం నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు సమావేశానికి ఆయన హాజరవుతారని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కేసీఆర్ కేవలం రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఒకసారి గవర్నర్ ప్రసంగం సందర్భంగా, మరోసారి బడ్జెట్ సమావేశాల సమయంలో మాత్రమే ఆయన సభకు హాజరయ్యారు. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది.

ఉంటారా? వెంటనే వెళ్తారా?
కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే పలుమార్లు డిమాండ్ చేశారు. ప్రజల డబ్బుతో జీతం తీసుకుంటున్న ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు రావాల్సిన బాధ్యత ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సభకు వస్తున్నారన్న వార్త రాజకీయంగా మరింత వేడెక్కింది.

అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో చురుగ్గా పాల్గొంటారా? లేక కేవలం సంతకం చేసి వెళ్లిపోతారా? అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.

ఈ సమావేశాల్లో కృష్ణా జలాల పంపకం, తెలంగాణకు జరిగిన అన్యాయం, ప్రాజెక్టుల అంశాలపై విస్తృత చర్చ జరగనుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఇదే అంశంపై సభలో గట్టిగా మాట్లాడాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ వాతావరణం అత్యంత ఉత్కంఠభరితంగా ఉండనుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

నిజంగా కేసీఆర్ కృష్ణా జలాలపై జరిగే చర్చలో పాల్గొంటే సభలో మాటల యుద్ధం మరో స్థాయికి వెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే విధంగా కేసీఆర్ కేవలం సంతకం చేసి వెళ్లిపోతే మాత్రం కాంగ్రెస్‌కు మరో రాజకీయ ఆయుధం దొరికినట్లవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొంటారా? లేక ఎప్పటిలాగే సభను త్వరగా వీడతారా? అన్నది చూడాల్సిందే.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this