దత్తు అఫీషియల్ “మండల దీక్షగొని” పాట ఆవిష్కరణ

Published on

-Advertisement-

 బెల్లూరి ధర్మశాస్త్ర ఆలయంలో ‘మండల దీక్షగొని’ సీడి ఘనంగా ఆవిష్కరణ

మన భారత్, ఆదిలాబాద్:
ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధల మధ్య బెల్లూరి ధర్మశాస్త్ర ఆలయ ప్రాంగణంలో ‘మండల దీక్షగొని’ అనే భక్తి గీతాల సీడీని ఘనంగా ఆవిష్కరించారు. కప్పర్ల సన్నిధానం గురుస్వాములు భారె నాగేష్, కౌడాల మధుకర్ గురుస్వాముల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సీడీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బెల్లూరి ఆలయ అధ్యక్షులు చంద గణేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి సత్యం గురుస్వామి, కోశాధికారి గౌరు లక్ష్మణ్ గురుస్వామి పాల్గొని సీడీని ఆవిష్కరించారు.

అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘మండల దీక్షగొని’ సీడీ భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణనిచ్చే విధంగా రూపొందించబడిందని గురుస్వాములు తెలిపారు. దీక్షా కాలంలో స్వాములు పాటించాల్సిన నియమాలు, భక్తి భావన ఈ గీతాల ద్వారా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

ఈ భక్తి గీతాల సీడీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు “Dattu Official” అనే యూట్యూబ్ ఛానల్‌లో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వీక్షించి, ఆలకించాలని వారు కోరారు.

ఆధ్యాత్మిక సంస్కృతి పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పాల్గొన్న గురుస్వాములు అభిప్రాయపడ్డారు.

Latest articles

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్షాల ముప్పు

 అప్రమత్తంగా ఉండాలని సూచనలు.. ఉత్తర కోస్తాపై డీప్‌ డిప్రెషన్‌ ప్రభావం మన భారత్‌, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

More like this