సద్గురు సుందరచైతన్యానందుల స్వామి పుట్టిన రోజు వేడుకలు

Published on

-Advertisement-

పొన్నారి మురళీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు

మన భారత్, ఆదిలాబాద్:

పూజ్య సద్గురు దేవులు శ్రీ శ్రీ శ్రీ స్వామి సుందరచైతన్యానందుల వారి 78వ జన్మదినాన్ని(పుట్టినరోజు) పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలోని మురళీకృష్ణ ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మురళీకృష్ణ ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేపట్టి మహా మంగళహారతులు నిర్వహించారు.

సద్గురు సుందరచైతన్యానందుల స్వామివారి ఆధ్యాత్మిక బోధనలు సమాజానికి మార్గదర్శకమని, సేవ, శాంతి, సద్భావనలతో జీవించాలనే సందేశాన్ని వారు అందించారని భక్తులు పేర్కొన్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలు, భజనలతో మార్మోగింది.

ఈ కార్యక్రమంలో సుందర సత్సంగ్ సభ్యులు మలపతి సుభాష్, రావుల పోతన్న, రాజేష్ ,పొచ్చన్న, మహేందర్, రామన్న, మల్లయ్య, భగవాండ్లు, సురేందర్, విలాస్ ఆలయ నిర్వాహకులు, సద్గురు భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో భాగమయ్యారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివరించాలని భక్తులు ఆకాంక్షించారు.

Latest articles

బాబూజీ హాస్పిటల్‌లో ‘వాట్సాప్’ వైద్యం!

బాబూజీ హాస్పిటల్‌లో 'వాట్సాప్' వైద్యం! ఆరోగ్యశ్రీ బోర్డులు మాత్రమే ఉన్నాయి.. ఐసీయూ (ICU) లేదు, డాక్టర్లు రారు!రాత్రి వేళల్లో పేషెంట్ల ప్రాణాలు...

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఏపీకి భారీ నుంచి అతిభారీ వర్షాల ముప్పు

 అప్రమత్తంగా ఉండాలని సూచనలు.. ఉత్తర కోస్తాపై డీప్‌ డిప్రెషన్‌ ప్రభావం మన భారత్‌, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

More like this