ముంబైలో మారణహోమం… 26/11 ఉగ్రదాడికి 17 ఏళ్లు
మన భారత్, ముంబై: దేశాన్ని కదిలించిన 26/11 ముంబై ఉగ్రదాడులకు నేడు 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26న రాత్రి సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడ్డ లష్కరే తోయిబా (LeT)కు చెందిన 10 మంది ఉగ్రవాదులు నగరాన్ని రక్తపు మడుగుగా మార్చారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST), తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్, కామా ఆసుపత్రి వంటి కీలక ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
మూడు రోజుల పాటు కొనసాగిన ఈ దాడులు నవంబర్ 29న భద్రతా బలగాల ప్రత్యేక ఆపరేషన్‌తో ముగిశాయి. మొత్తం 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. దాడికి బాధ్యులైన 10 మంది టెర్రరిస్టుల్లో 9 మందిని కమాండోలు మట్టుబెట్టగా, ఏకైకంగా పట్టుబడ్డ అజ్మల్ కసబ్‌ను కఠిన న్యాయ ప్రక్రియ అనంతరం 2012 నవంబర్ 21న ఉరితీశారు.
దేశ భద్రతా వ్యవస్థలో మార్పులకు కారణమైన ఈ ఘటనను భారతదేశం ప్రతి సంవత్సరం కన్నీటి పర్యంతం స్మరించుకుంటోంది. అమరులైన పోలీసు, ఎంట్రీ కమాండోలను దేశం నివాళులర్పిస్తోంది.
