తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల – మూడు దశల్లో పోలింగ్, 27 నుంచి నామినేషన్లు ప్రారంభం
మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కీలక వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
నామినేషన్ షెడ్యూల్ ఇలా:
మొదటి విడత: నవంబర్ 27 నుంచి
రెండో విడత: నవంబర్ 30 నుంచి
మూడో విడత: డిసెంబర్ 3 నుంచి
రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలు , 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ సమయం: ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
పోలింగ్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే, రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని కమిషనర్ స్పష్టం చేశారు.
ఈసారి మూడు దశల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు గ్రామీణ రాజకీయాల్లో కీలకంగా భావించబడుతున్నాయి. అన్ని జిల్లాల్లో నామినేషన్ల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
