గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

Published on

-Advertisement-

మన భారత్, నాందేడ్:

నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సాహితీవేత్త, బహుభాషా కవి, అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పెట్కులేకు విశిష్ట సన్మానం లభించింది.

ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ గురు రవిదాస్ సమతా ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణలో బహుజన మహనీయుల సాహిత్య ప్రచారం, విగ్రహాల ఏర్పాటు, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో విశేష సేవలు అందిస్తున్న సుకుమార్ పెట్కులే కృషిని గుర్తించి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఇంజనీర్ చంద్రప్రకాష్ దేగ్లూర్కర్ ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సుకుమార్ పెట్కులే మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేయడం అంటే ముళ్లబాటలో నడిచినట్లేనని, ఎన్నో ఆటంకాలు ఎదురైనా అలుపెరుగని సేవాభావంతో ముందుకు సాగితేనే సమాజంలో మార్పు తీసుకురాగలమని పేర్కొన్నారు. మహనీయుల ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

కవి సమ్మేళనంలో బహుజన ఆలోచనా విధానంపై సుకుమార్ పెట్కులే హిందీలో కవితను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఆదిలాబాద్ కు చెందిన ప్రముఖ సాహితీవేత్త మధు బావల్కర్ మరాఠీలో కవితను వినిపించారు. కార్యక్రమం ఆధ్యంతం సాహిత్య రసమయంగా సాగింది.

సన్మాన కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్, పూణేకు చెందిన పుండలీక్ భామోదే, డాక్టర్ నిర్మలా బామోదే (అకోలా), నాగనాథ్ డోలారే (ముంబై), ఆనంద్ భాలే రావు (కిన్వట్), మధు బావల్కర్ (ఆదిలాబాద్), నిర్వాహకులు చంద్రప్రకాశ్ దేగళూర్కర్ (నాందేడ్) తదితరులు పాల్గొన్నారు.

గురు రవిదాస్ జయంతి వేడుకలు సామాజిక సమానత్వం, సాహిత్య ప్రేరణకు వేదికగా నిలిచాయని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

Latest articles

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం  కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు మన...

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు

మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శివన్నకు హార్దిక శుభాకాంక్షలు సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న...

వైద్య నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం ఆరోపణలు

సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్...

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి

BT3 విత్తనాలు విక్రయిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి  నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్...

More like this