ఎకరాకు రూ.10 వేలు కాదు.. రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి: కవిత

Published on

📰 Generate e-Paper Clip

మత్తడి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ – కల్వల మత్తడి వద్ద రైతుల బాధలు తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు

మన భారత్, కరీంనగర్, అక్టోబర్ 31: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైతుల తరపున బలమైన స్వరం వినిపించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి వద్ద భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఆమె, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..“రైతులు ఎకరాకు రూ. 10 వేలు కాకుండా ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించాలి” అని కవిత డిమాండ్ చేశారు.

మూడు సంవత్సరాల క్రితం కల్వల మత్తడి కొట్టుకుపోయిందని, దానిని మరమ్మతు చేసేందుకు అప్పటి ప్రభుత్వం రూ. 70 కోట్లు విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం మారిన తరువాత ఆ పనులు నిలిచిపోయాయని విచారం వ్యక్తం చేశారు. హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలిసి ఈ మత్తడి పునరుద్ధరణకు కృషి చేయాలని ఆమె కోరారు.

6 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ వల్ల వందలాది రైతు కుటుంబాలు బతుకుతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈరోజు అవి కష్టాల్లో కూరుకుపోయాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రైతులందరూ తీవ్ర నష్టాన్ని చవిచూశారని, కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, ఖమ్మం జిల్లాలకు మాత్రమే పరిహారం ప్రకటించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “శంకరపట్నం రైతులు కూడా వరి పంటలు కోతకు సిద్ధం అయ్యే సమయంలో పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వం వీరిని కూడా గుర్తించాలి” అని అన్నారు.

“పంట చేతికొచ్చిన రైతులు ఇప్పుడు 25 శాతం దిగుబడికే పరిమితమయ్యారు. ఇది బాధాకరం. ప్రభుత్వం రైతుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాలి,” అని కవిత హితవు పలికారు.

జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఫీల్డ్ అధికారుల ద్వారా పంట నష్టం లెక్కలు తీయాలని సూచించిన ఆమె, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్రం తరఫున రైతులకు పరిహారం పొందేందుకు ప్రయత్నించాలన్నారు.

అటు కల్వల మత్తడి రిపేర్ పనులు ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలని ఆమె ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉన్న దాదాపు 180 ముదిరాజ్ కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోకుండా కాపాడాలని కవిత కోరారు.

“రైతు లేనిదే రాజ్యం లేదు. ఆ మాటకు అర్ధం ఇవ్వాలంటే రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి,” అంటూ కవిత తన పర్యటనను ముగించారు.

Latest articles

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...

విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి..

జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో...

More like this

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...