కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్

Published on

📰 Generate e-Paper Clip

కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ – “అజారుద్దీన్‌పై కేసులు ఎక్కడ..? వివరాలు చెప్పండి!” 

మన భారత్, హైదరాబాద్: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “అజారుద్దీన్‌పై కేసులు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ ఆ కేసులు ఎక్కడ? అవి ఏమయ్యాయి? కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి” అని సవాల్ విసిరారు.

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా అజారుద్దీన్ దేశానికి ఎన్నో విజయాలు అందించారు అని గుర్తుచేస్తూ, “అలాంటి వ్యక్తిపై అప్రజాస్వామ్య వ్యాఖ్యలు చేయడం కిషన్ రెడ్డి స్థాయికి తగదు” అన్నారు. ప్రజాప్రతినిధిగా కూడా అజారుద్దీన్ మంచి సేవలు అందించారని పేర్కొన్నారు.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, “అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల మైనారిటీ వర్గానికి మేలు జరుగుతుంది. ఇది సామాజిక సమానత్వానికి సంకేతం” అని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “అజారుద్దీన్‌పై విమర్శలు చేయడం అంటే దేశ గౌరవాన్ని దెబ్బతీయడం లాంటిదే” అని బీజేపీ నేతలను ఉద్దేశించి మండిపడ్డారు.

అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వడం కొత్త నిర్ణయం కాదని, మూడు నెలల క్రితమే కాంగ్రెస్ నాయకత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. “కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ముందు సమాచారం తెలుసుకుని స్పందిస్తే మంచిది” అని ఆయన సూచించారు.

మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. కిషన్ రెడ్డి ప్రతిస్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Latest articles

పోరండ్ల సంతోష్ అను నేను.. దేవాపూర్ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న..

దేవాపూర్ గ్రామ సర్పంచ్‌గా సంతోష్ ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి నూతన సర్పంచ్‌గా...

కజ్జర్ల సర్పంచ్‌గా ఎల్మ నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం..

గ్రామాభివృద్ధే ధ్యేయం.. కజ్జర్ల సర్పంచ్‌గా ఎల్మ నారాయణరెడ్డి ప్రమాణ స్వీకారం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి...

మర్రి చెట్టు నీడలో ప్రమాణ స్వీకారం..

మర్రి చెట్టు నీడలో ప్రజాస్వామ్య ప్రమాణం.. సకినాపూర్ సర్పంచ్‌గా నికిత నగేష్ ప్రమాణ స్వీకారం మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు...

సాయి కిరణ్ కు ఘన సన్మానం..

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి...

More like this