పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అండదండలతోనే అటెండర్ యాకుపాషా అరాచకాలు.?
మన భారత్, కరీంనగర్ : గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అటెండర్ యాకూబ్ పాషా లైంగిక వేధింపుల ఘటనలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ లో ఎన్నో సంచలన విషయాలు బయట పడ్డాయి. యాకుబ్ బాషాకు సంబంధించి పోక్సో కేసు కావడంతో వివరాలు బయటకు పొక్కకుండా మంగళవారం రహస్య విచారణ చేపట్టారు. కొన్ని విస్తబోయే నిజాలు బయటపడ్డాయి.బాలికలపై గత కొంత కాలంగా అటెండర్ యాకుబ్ భాషా, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు నిర్ధారణ అయింది.తరగతి గదిలో, విశ్రాంతి గదుల్లో బాలికల పట్ల అత్యంత అసభ్యకరం గా జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నాడని, యాకుబ్ పాషాపై చర్యలు తీసుకోవాలని గతంలోనే బాలికలు స్కూల్ హెడ్ మాస్టర్, కమలకు ఫిర్యాదు చేశారు. కాగా యాకుబ్ పాషాను పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు కమల, వెనుకేసు కొచ్చారు. ఈ విషయం ఎవరికైనా చెబితే టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తాను అని హెడ్మాస్టర్ కమల పదవ తరగతి బాలికలను బెదిరించారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికలు భయపడి ఎవరికి చెప్పలేకపోయారు. టీసీ ఇస్తే మా భవిష్యత్తు ఏమైపోతుందోనని,వాడీ అరాచకాలు భరించారు. హెడ్మాస్టర్ కమల అండ దండలతోనే అటెండర్ యాకూబ్ పాషా, ఈ దారుణాలకు పాల్పడ్డాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ తీగలాగితే డొంక కదిలినట్లుగా త్రిసభ్య కమిటీ విచారణతో యాకు బ్ భాషా అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి… బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు బయటపడడం తో ఈ వ్యవహారం పై కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు వెంటనే హెడ్మాస్టర్ కమలను సస్పండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే క్రిమినల్ చర్యలకు వెనకాడకూడదని కలెక్టర్ పోలీస్ అధికారులకు సూచించారు. యాకూబ్ షాషాకు అనుకూలంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరిద్దరు అధికారుల తప్పిదాలవల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా?
కరీంనగర్: మానవ మృగాళ్ల దారుణాలతో బాలికలకు రక్షణే లేకుండా పోతోంది. బడికిపోతే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇబ్బందిపట్టే ఉపాధ్యాయులు రూపంలో ఉన్న కామాంధులు కొందరైతే.. అమ్మాయిల వాష్ రూమ్స్‌లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసి.. వికృత ఆనందం పొందే నీచులు మరికొందరు. తాజాగా కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలోని బాలికల వాష్ రూమ్ లో రహస్య కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపింది. అమ్మాయిల బాత్రూమ్లో అటెండర్ యాకూబ్ సీక్రెట్ కెమెరాను పెట్టి.. వీడియో లు రికార్డు చేస్తున్నాడు. బాత్రూమ్లో ఓ పరికరం మెరుస్తూ ఓ పరికరం బాలికల కంట పడింది. ఏంటా అని చెక్ చేయగా.. రహస్య కెమెరా అని గుర్తించారు. వెంటనే ప్రధానోపాధ్యాయునికి తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు. బాత్రూమ్ నుంచి కెమెరా తరహా పరికరం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆగ్రహంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ పాఠశాలకు చెందిన అటెండర్ యాకూబ్ అని తేలింది. ఇతను సీక్రెట్ కెమెరాను అమర్చి.. వీడియోలు రికార్డు చేస్తూ వికృత ఆనందం పొందు తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా.. అటెండర్ యాకూబ్ బాలికల ఫొటోలు తీసి వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. బాలికలు, వారి తల్లిదండ్రు లు వెంటనే ఈ విషయాన్ని హెడ్మాస్టర్కు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వాష్‌రూమ్ నుంచి కెమెరా తరహా పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరంలో ఉన్న రికార్డుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడైన అటెండర్ యాకూబ్ ఈ విషయం బయటపడటంతోనే పరారీలో ఉన్నాడు. స్కూల్ వాతావరణంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణం. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతు న్నారు. ఈ వ్యవహారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
