మీ-సేవ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Published on

-Advertisement-

కూచులాపూర్‌లో మీ-సేవ కేంద్రం ప్రారంభం

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

తలమడుగు, జూలై 25: మారుమూల గ్రామాల ప్రజలకు మీ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మీ-సేవ కేంద్రాన్ని  ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు మీ -సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామస్థాయిలోనే మీ-సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి తాను ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నానని, విడతల వారీగా గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

అలాగే గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మహిళా సమాఖ్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వారికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. రైతు బాగుంటేనే ప్రాంతం బాగుంటుందని పేర్కొంటూ.. రైతుల విజ్ఞప్తి మేరకు కుచులాపూర్ ప్రాంతంలో త్వరలోనే విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో రైతులకు సాగునీటి అవసరాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల అవసరాలను గుర్తించి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో కూచులాపూర్ సర్పంచ్ మోడేపు వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి వివిధ మండలాల సర్పంచ్‌లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకురావాలి: పీఆర్ఆర్

మన భారత్ | ఆదిలాబాద్: దేశవ్యాప్తంగా పేపర్ లీక్‌లు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేలా కేంద్ర ప్రభుత్వం...

మిగిలింది ఆరు రోజులే..!

ఓటును సురక్షితం చేసుకోండి కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట జూలై 25: ఎన్నికల సంఘం నిర్వహి స్తున్న ఎస్ ఐ...

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

మన భారత్ | న్యూఢిల్లీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఆయన...

ప్రజల సహకారం అవసరం: ఎస్పీ అఖిల్ మహాజన్

ధనోర (బి), మన భారత్ గ్రామంలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం: ఎస్పీ...

More like this