నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, జూలై 21: భవిష్యత్ తరాల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసేందుకు వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో పాటు వ్యవసాయ భూముల్లో ఫామ్ పాండ్లు నిర్మించడం ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో నీటి వనరుల సమర్థ వినియోగం కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటి అవసరం ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగును రైతులు ప్రోత్సహించాలని సూచించారు. దీంతో సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా నీటి వినియోగం కూడా సమర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెరువులు, కాలువల్లో పేరుకుపోయిన సిల్టేషన్‌ను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి రైతులకు సాగునీటి అందుబాటు మెరుగుపడుతుందని వెల్లడించారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

చీకట్లకు చెక్.. గ్రామంలో వెలుగుల సందడి

గడసాం గ్రామంలో కొత్త వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు.. చీకట్లకు చెక్, గ్రామంలో వెలుగుల సందడి మన భారత్, గడసాం: గ్రామ...

More like this