మన భారత్,జూలై 20 ఆదిలాబాద్
తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి అడుగులు
ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కీలక కార్యక్రమం నిర్వహించారు. బోథ్ మండలంలోని కంటేగామ, నిగ్ని, సోనాల గ్రామాలకు చెందిన సుమారు 25 మంది యువకులు తెలంగాణ రక్షణ సేనలో అధికారికంగా చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతోందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో యువత పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో బోథ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. యువత సమాజ మార్పుకు కీలక శక్తిగా నిలవాలని, ప్రజా సమస్యలపై చైతన్యంతో పనిచేయాలని సూచించారు.
పార్టీలో చేరిన యువకులు తెలంగాణ రక్షణ సేన సిద్ధాంతాలను గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రమేష్, శ్రీను, సంతోష్, రాకేష్, అశోక్, సాయన్న, రమణ, విష్ణు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కొత్తగా చేరిన సభ్యులను అభినందించారు.
తెలంగాణ రక్షణ సేన బోథ్ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, గ్రామాల వారీగా నిర్వహిస్తున్న చేరికలతో పార్టీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటున్నాయని నాయకులు పేర్కొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ ఆర్సీ ఇన్చార్జి.
ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
