బహుజన రాజ్యాధికారం రావాలి..

Published on

-Advertisement-

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్

మన భారత్, జైనథ్: జూలై 19

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో బహుజన రాజ్యాధికారం రావాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్‌వాడ,లేకర్వాడ గ్రామల లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో బహుజన రాజ్యాధికారం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. సమావేశానికి బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజ్యాధికారంతోనే సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు లభిస్తాయని అన్నారు. మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ వంటి నాయకులు చూపిన మార్గంలో బహుజన సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే బహుజన రాజ్యాధికారం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని రమేష్ పేర్కొన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం పెంపొందించి, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు బీఎస్పీ కార్యకర్తలు గ్రామస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.

సమావేశంలో మహనీయుల ఆలోచనా విధానం, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, బహుజన ఐక్యత, యువత రాజకీయాల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై నాయకులు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు దుమ్ము శ్రీహరి, నాయకులు రాకేష్, నందు, హర్షవర్ధన్, క్రిష్, ఋషికేష్, ప్రమోద్, నర్సింగ్, ఈశ్వర్, యోగేష్, డి. హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి: మంత్రి

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి.. శాస్త్రీయ డిజైన్లతో పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన భారత్,...

ఆ చెత్తను వెంటనే తొలగించాలి..

అంబేద్కర్ చౌక్–కిసాన్ చౌక్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్త.. వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త ప్రేమకళ మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా...

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

More like this

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి: మంత్రి

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి.. శాస్త్రీయ డిజైన్లతో పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన భారత్,...

ఆ చెత్తను వెంటనే తొలగించాలి..

అంబేద్కర్ చౌక్–కిసాన్ చౌక్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్త.. వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త ప్రేమకళ మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా...

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....