ఐటీఐ విద్యార్థులే భవిష్యత్ శక్తి ..

Published on

-Advertisement-

ఐటీఐ విద్యార్థులే పరిశ్రమల భవిష్యత్ శక్తి

– అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రాజెక్ట్ ఎక్స్‌పో

–2026ను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్ | ఆదిలాబాద్ | జూలై 2, 2026

దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో, ఆ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తీర్చిదిద్దడంలో ఐటీఐ విద్యార్థులు అంతే కీలకమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ అన్నారు. సాంకేతిక విద్యతో పాటు ఆధునిక టెక్నాలజీలపై పట్టు సాధిస్తే దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగ అవకాశాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని విద్యార్థులకు సూచించారు.

గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్‌పో–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ ఎక్స్‌పోను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన వివిధ సాంకేతిక ప్రాజెక్టులను పరిశీలించి, వాటి రూపకల్పన, వినియోగం, సాంకేతిక అంశాలపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఎక్స్‌పోలో ఇంజినీరింగ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, సీఎన్‌సీ మెషిన్ మెకానిక్, వర్చువల్ అనాలిసిస్, ఎలక్ట్రిషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), డ్రెస్ మేకింగ్, స్టెనోగ్రఫీ తదితర ట్రేడ్లకు చెందిన వినూత్న ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించిన తీరు ఎస్పీని ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు సంప్రదాయ నైపుణ్యాలతో పాటు 3D టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్, ఇండస్ట్రియల్ డిజిటలైజేషన్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని సూచించారు. నైపుణ్యంతో కూడిన సాంకేతిక విద్యే భవిష్యత్‌లో ఉన్నత ఉద్యోగాలకు బాట వేస్తుందని చెప్పారు.

విద్యార్థులు రూపొందించిన ప్రతి ప్రాజెక్టు సృజనాత్మకత, పరిశోధనాత్మక దృక్పథం, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఇలాంటి ప్రాజెక్ట్ ఎక్స్‌పోలు విద్యార్థుల్లో ఆవిష్కరణ శక్తిని పెంపొందించడమే కాకుండా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మావల సీఐ బి.డి. ప్రేమ్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...

గుడుంబా అక్రమ మద్యం స్వాధీనం..

మన భారత్, ఆదిలాబాద్ 14 ద్విచక్ర వాహనాలు సీజ్ ఆదిలాబాద్, జూలై 20:ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల నిర్మూలన...

More like this

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

మన భారత్,జూలై 20 ఆదిలాబాద్ తెలంగాణ రక్షణ సేనలో 25 మంది యువకుల చేరిక.. బోథ్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి...