ఎమ్మెల్యే చిత్ర పటానికి పాలాభిషేకం..

Published on

-Advertisement-

కుచులపూర్‌లో తీరిన తాగునీటి సమస్య..

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో నాలుగు బోర్ల ఏర్పాటు

నీటి వసతి కల్పించిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల కృతజ్ఞతలు..

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులపూర్ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది. గ్రామంలో నెలకొన్న నీటి ఇబ్బందులను పరిష్కరించేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవ తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టారు.

గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కుచులపూర్‌లో నాలుగు (04) బోర్లను ఏర్పాటు చేయించి నీటి సరఫరాకు మార్గం సుగమం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మోడెపు వెంకన్న మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాల్లో తాగునీరు ముఖ్యమైనదని, గ్రామ సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

నీటి వసతి మెరుగుపడటంతో సంతోషించిన గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభినందనలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this