చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు..

Published on

-Advertisement-

పల్లి (బి) గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు చుక్కల మందు వేయించిన సర్పంచ్ కట్కం సంజీవ్

5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో వేయించాలి : సర్పంచ్ సూచన

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి బి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామంలోని చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కట్కం సంజీవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల మందు వేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలను పోలియో వంటి వ్యాధుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడానికి ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమానికి హాజరు కాని చిన్నారుల ఇళ్లకు వెళ్లి వారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, అలాగే తల్లిదండ్రులకు పల్స్ పోలియో ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు.

చిన్నారుల ఆరోగ్య భద్రత కోసం ప్రతి కుటుంబం బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లల భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this