ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: కౌడాల సంతోష్

Published on

-Advertisement-

పొన్నారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

మన భారత్, ఆదిలాబాద్:

తాంసి మండలం పొన్నారి గ్రామంలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుక్రవారం ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌడాల సంతోష్ పాల్గొని లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా కౌడాల సంతోష్ మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు దశలవారీగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలారి భూమన్న, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, ఆత్మ చైర్మన్ నారాయణ, నాయకులు గడుగు గంగన్న, ఆకాష్, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this