అధికారులకు ఘన సన్మానం..

Published on

-Advertisement-

తాంసి రెవెన్యూ కార్యాలయంలో అధికారులకు ఘన సన్మానం

బదిలీపై వెళ్తున్న ఆర్‌ఐ నరేష్‌కు వీడ్కోలు

– కొత్తగా వచ్చిన ఏఈవో గంగారెడ్డికి స్వాగతం

మన భారత్, తాంసి:

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహించిన అధికారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఐదు సంవత్సరాల పాటు తాంసి మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా సేవలందించిన నరేష్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయనకు ఘన వీడ్కోలు పలికారు. అదే సమయంలో తాంసి క్లస్టర్‌లో వ్యవసాయ విస్తరణ అధికారిణి (ఏఈవో)గా విధులు నిర్వహించిన నికితకు అభినందనలు తెలియజేశారు. అలాగే తాంసి మండలానికి నూతనంగా ఏఈవోగా బాధ్యతలు స్వీకరించిన కంది గంగారెడ్డికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, ఆర్‌ఐ నరేష్ తన సేవా కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ప్రభుత్వ పథకాల అమలు, భూ సమస్యల పరిష్కారం, రైతుల సమస్యల పరిష్కారంలో ఆయన విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ కార్యాలయ పనితీరును మెరుగుపరిచారని తెలిపారు.

తాంసి క్లస్టర్‌లో పనిచేసిన ఏఈవో నికిత రైతులకు సాంకేతిక సలహాలు అందిస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడ్డారని నాయకులు ప్రశంసించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంలో ఆమె పాత్ర కీలకమైందన్నారు.

నూతన ఏఈవో కంది గంగారెడ్డిని స్వాగతిస్తూ, రైతుల సంక్షేమం కోసం మరింత చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు. మండల రైతుల అవసరాలు గుర్తించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సన్మాన కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి (ఏఓ) రవీందర్,  మాజీ సర్పంచ్ స్వప్న రత్నప్రకాష్, వన్నెల నరేష్, శ్రీధర్ రెడ్డి, రామన్న యాదవ్, గోవర్ధన్ రెడ్డి, కాంత్ రెడ్డి, దేవాపూర్ సర్పంచ్ సంతోష్, తాంసి సర్పంచ్ సంతోష్ రెడ్డి రెడ్డి, అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, రఘు రెడ్డి, ఆత్మ చైర్మన్ కే. నారాయణ, సంతోష్తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రైతు ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమం చివరలో అధికారులకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ప్రజలకు సేవలందించిన అధికారుల సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విధులు నిర్వర్తించాలి

పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు.. వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని...

CEIRలో ఫిర్యాదు చేస్తే మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం: ఎస్పీ

పోయిన మొబైల్ ఫోన్లను వెతికి పట్టిన ఆదిలాబాద్ పోలీసులు రూ.12.5 లక్షల విలువైన 105 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత.....

More like this

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విధులు నిర్వర్తించాలి

పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు.. వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని...