e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

దివ్యాంగురాలి కుటుంబానికి అండగా సర్పంచ్

మన భారత్, మొగుళ్ళపల్లి:

సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ దంపతులు మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా మండల కేంద్రానికి చెందిన ఓ దివ్యాంగురాలి కుటుంబానికి అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులు టీఆర్‌సీపీటీయూ సభ్యులతో కలిసి స్వయంగా ఆ కుటుంబాన్ని సందర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి జీవనోపాధికి అవసరమైన నెలవారీ నిత్యావసర సరుకులను అందించి సహానుభూతి చాటారు. ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

సర్పంచ్ చాట్ల విజయ–రవీందర్ మాట్లాడుతూ, సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా దివ్యాంగులకు చేయూతనిస్తే వారి జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని తెలిపారు. దివ్యాంగురాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు.

భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిన సర్పంచ్ దంపతుల సేవా భావాన్ని గ్రామ ప్రజలు, అధికారులు అభినందిస్తున్నారు. మానవత్వం పరిమళించే ఈ తరహా కార్యక్రమాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE