జర్నలిస్టుల హక్కులకు ప్రాధాన్యం..

Published on

-Advertisement-

మన భారత్, హైదరాబాద్:

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిర్వహిస్తున్న నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా (NUJ-I) జాతీయ మహాసభలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహాసభల రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. వివేక్ హాజరై, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డా. వివేక్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు చేర్చే కీలక వంతెనగా పనిచేస్తున్నారని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కనీస సౌకర్యాలు కల్పించడం అవసరమని పేర్కొన్నారు.

నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కలిగిందని, దేశంలోని అన్ని రాష్ట్రాల సభ్యులతో కూడిన అతిపెద్ద యూనియన్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DSFI) తరఫున కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్స్ యూనియన్ ఈ మహాసభలను రాజధానిలో నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి చేపట్టే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు నారగౌని పురుషోత్తం, కార్యదర్శి తోకల అనిల్‌తో పాటు జిల్లా స్థాయి నాయకత్వాన్ని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిర్రగొని ఉదయ్ ధీర్, కార్యదర్శి పోతుగంటి సతీష్ చారీ, మరో కార్యదర్శి గండు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this