ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు..

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం అర్లి (కే) గ్రామంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులకు శుభారంభం జరిగింది. గ్రామంలోని పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు, అలాగే రోడ్డు కల్వర్టు నిర్మాణానికి రూ.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్‌ఆర్‌ఈజీఎస్ (NREGS) ద్వారా మంజూరు చేయగా, ఈ పనులకు గ్రామంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ కు అర్లి (కే) గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం జరగడం వల్ల విద్యార్థుల భద్రత మెరుగుపడటంతో పాటు పాఠశాల పరిసరాలు కూడా సక్రమంగా ఉంటాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

అదేవిధంగా రోడ్డు కల్వర్టు నిర్మాణం వల్ల వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే రాకపోకల ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు తీసుకువచ్చిన ఎంపీ గోడం నగేష్‌కు గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బోండ్ల వెంకట స్వామి, గ్రామ సర్పంచ్ నారు లక్ష్మి వెంకన్న, ఉపసర్పంచ్ కే. మహావీర్, గ్రామ సెక్రటరీ అర్చన, వార్డు సభ్యులు గజానన్, శ్రీకాంత్, జంగు, లస్మన్న, భగవండ్లు, కోరండ్ల పురుషోత్తం, భాపు రెడ్డి, ఉపాధ్యాయులు సంజీవ్, ప్రశాంత్, సుధాకర్, అలాగే బీజేపీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this