మేడారంలో ఆకర్షణగా ఇప్ప పువ్వు లడ్డూ!

Published on

మన భారత్, తెలంగాణ:

ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఈసారి ఆదివాసీల సంప్రదాయ రుచిని ప్రతిబింబించే ఇప్ప పువ్వు లడ్డూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. గిరిజన సంస్కృతి, ఆహార సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రత్యేక లడ్డూ జాతర సందడిలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖల ప్రోత్సాహంతో తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామానికి చెందిన సెర్ఫ్ మహిళలు ఈ ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేస్తున్నారు. నాలుగు రోజులపాటు ప్రత్యేక శిక్షణ పొందిన అనంతరం, ఆదిలాబాద్ ప్రాంతం నుంచి కిలో రూ.200కు ఇప్ప పువ్వును తెప్పించి లడ్డూలుగా తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు.

తయారైన లడ్డూలను ఒక్కో ప్యాకెట్‌ను రూ.150 ధరకు జాతరలో విక్రయిస్తున్నామని సెర్ఫ్ మహిళలు పేర్కొన్నారు. సహజమైన పదార్థాలతో తయారైన ఈ లడ్డూలకు భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, దీనివల్ల తమకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి దోహదపడుతూ, వారి సంప్రదాయ వంటకాలను ప్రజలకు చేరువ చేస్తున్న ఈ ప్రయత్నం మేడారం జాతర ప్రత్యేకతను మరింత పెంచుతోంది.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this