స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Published on

-Advertisement-

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరల ఊగిసలాట

మన భారత్, హైదరాబాద్:
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల మార్పులు, డాలర్ మారకం విలువలో హెచ్చుతగ్గుల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు పైకి కదిలినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి.

ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,46,280కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,31,800గా నమోదైంది.

అటు వెండి ధరలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది. కేజీ వెండి ధర రూ.4,000 పెరిగి రూ.3,10,000కు చేరింది. ఇటీవల పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడంతో పాటు పారిశ్రామిక అవసరాల కారణంగా వెండి ధరలు పైబాట పట్టినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నాయని వ్యాపారులు తెలిపారు. స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ధరలు మరింత మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this