పేరెంట్స్ కంట్రోల్స్‌తో పూర్తి నియంత్రణ
మన భారత్, న్యూఢిల్లీ:
పిల్లలు యూట్యూబ్ వీడియోలకు అధికంగా అలవాటు పడుతున్న నేపథ్యంలో వారి స్క్రీన్ టైమ్‌ను నియంత్రించేందుకు యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్‌ను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తల్లిదండ్రులు పిల్లలు యూట్యూబ్‌లో గడిపే సమయాన్ని పరిమితం చేయడం, అవసరమైతే పూర్తిగా వీడియోల వీక్షణను బ్లాక్ చేయడం చేయవచ్చు.
పిల్లలు రోజంతా స్క్రీన్‌లకే పరిమితం అవుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో యూట్యూబ్ ఈ మార్పులను అమలు చేసినట్లు సమాచారం. పేరెంటల్ కంట్రోల్స్ ద్వారా రోజువారీ టైమ్ లిమిట్ సెట్ చేయడం, నిర్దిష్ట కంటెంట్‌ను మాత్రమే అనుమతించడం, అనవసర వీడియోలను నిరోధించడం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల పిల్లల ఆన్‌లైన్ అలవాట్లపై తల్లిదండ్రులకు పూర్తి నియంత్రణ లభించనుంది.
అదేవిధంగా, పిల్లల కోసం ప్రత్యేకంగా ‘కిడ్స్ ప్రొఫైల్స్’ క్రియేట్ చేసే విధానాన్ని యూట్యూబ్ మరింత సులభతరం చేసింది. సైన్-అప్ ప్రక్రియను ఈజీ చేయడంతో తల్లిదండ్రులు సులభంగా పిల్లల ఖాతాలను రూపొందించి, వయస్సుకు తగిన కంటెంట్‌ను మాత్రమే చూపించేలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
డిజిటల్ ప్రపంచంలో పిల్లల భద్రత, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు యూట్యూబ్ వెల్లడించింది. ఈ ఫీచర్లతో పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గి, చదువు, ఆటలు, కుటుంబంతో గడిపే సమయానికి ప్రాధాన్యం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
