కొరట చనక ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం..

Published on

ఆదిలాబాద్‌కు సాగునీటి ఊతం

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనమల రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం హత్తి–హత్తీ ఘాట్ వద్ద నిర్మించిన కొరట చనక ప్రాజెక్టు పంప్ హౌస్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రితో కలిసి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ గోడం నగేష్ గారు పంప్ హౌస్‌ను ప్రారంభించారు.

ప్రాజెక్టు ద్వారా ప్రాంతానికి సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడిందని నాయకులు పేర్కొన్నారు. రైతులకు నీటి అందుబాటు పెరగడంతో వ్యవసాయ ఉత్పత్తి మెరుగు పడనుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమాన్ని ప్రధాన అజెండాగా తీసుకుని సాగునీటి ప్రాజెక్టుల వేగవంతానికి కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్, జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటి పెళ్లి గంగాధర్ రావు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

కొరట చనక ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరిగి, రైతుల ఆదాయం వృద్ధికి బాటలు వేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this