e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

హైందవ ధర్మమే సనాతన ధర్మం.‌.

దేవాపూర్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా

మన భారత్ | తలమడుగు:

తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ యువకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షులు దాతాజీ కిరణ్ మాట్లాడుతూ… తన జ్ఞాన పరంపరతో భారత జాతిని జాగృతం చేసిన తాపసి స్వామి వివేకానందుడని కొనియాడారు. హైందవ ధర్మమే సనాతనం, నిత్యనూతనం అని ప్రపంచానికి చాటిన సాహసి ఆయనని పేర్కొన్నారు. తనువంతా దేశభక్తిని, మనసంతా ఆధ్యాత్మిక శక్తిని నింపుకొని జీవించిన శేముషీగా వివేకానందుడు భారత యువతకు మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు.

కర్మాచరణనే ఆశయంగా నడిచిన చైతన్యశీలి, దేశమే దేహంగా జీవించిన మహర్షి, తన వాగ్ధాటితో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసిన దేవర్షిగా స్వామి వివేకానందుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని దాతాజీ కిరణ్ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతనమస్సులు అర్పిస్తూ, జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ సర్పంచ్ పొరండ్ల సంతోష్, ఉప సర్పంచ్ మేకల శ్రీరామ్‌తో పాటు అడెపు శ్రీనివాస్, శానం శ్రీనివాస్, గంధం నరేష్, శాగంటి లచ్చన్న, సంఘర్తి నారాయణ, గోనె శ్రీనివాస్, అనంతుల రమణయ్య, బర్ల వెంకటి, ఎల్లూరి ప్రవీణ్ రెడ్డి, కొంగల గణేష్, సంఘర్తి శ్రీనివాస్, శీర్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే దేవాపూర్ యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE