కజ్జర్ల నూతన సర్పంచ్‌కు ఘన సన్మానం..

Published on

-Advertisement-

డా. రవికిరణ్ యాదవ్ చేతుల మీదుగా అభినందనలు

మన భారత్, తలమడుగు : మండలంలోని కజ్జర్ల గ్రామంలో ఇటీవల గ్రామ సర్పంచ్‌గా నూతనంగా ఎన్నికైన ఎల్మా నారాయణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ శాలువా కప్పి సర్పంచ్‌ను సత్కరించారు.

ఈ సందర్భంగా డా. రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచ్ ప్రజల ఆశలు నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ, గ్రామంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సాయి వైకుంఠ ట్రస్ట్ తరపున గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.

సన్మాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రవికాంత్ యాదవ్, మట్ట శ్రీనివాస్ యాదవ్, మహేందర్ యాదవ్, ప్రవీణ్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, నాయకులు నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Latest articles

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

అంబేద్కర్ విగ్రహావిష్కరణ మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం..

పల్లి (బి)లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఆహ్వానం మన భారత్, జూలై 23 తలమడుగు: తలమడుగు మండలం...

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి: కలెక్టర్ రాజర్షి షా డబుల్ ఓటర్లు వెంటనే ఒకే ప్రాంతంలో ఓటు కొనసాగించేలా...

అంతరాష్ట్ర రహదారిపై కాంగ్రెస్ నేతల ఆందోళన

తలమడుగులో కాంగ్రెస్ నాయకుల రాస్తారోకో రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ సుంకిడి వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఆందోళన మన భారత్, తలమడుగు:...

More like this