ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు పై క్లారిటీ..!

Published on

-Advertisement-

ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు కాదు.. ప్రభుత్వం స్పష్టత

మన భారత్, తెలంగాణ: ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేశారనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా కొంత గందరగోళం నెలకొంది. ఇటీవల కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాల పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ అకౌంట్ల నుంచి జరిగే చెల్లింపులు పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీఓ, అలాగే సర్పంచ్ లేదా ఎంపీపీ డిజిటల్ సంతకాలతోనే నిర్వహించాలని ఆ మెమోలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో అధికారుల వర్గాలు, మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఉప సర్పంచ్లకు చెక్ పవర్ పూర్తిగా రద్దు చేశారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉప సర్పంచ్లలో ఆందోళన వ్యక్తమైంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రభుత్వం జారీ చేసిన మెమోలో ఉప సర్పంచ్ చెక్ పవర్‌ను పూర్తిగా తొలగించినట్లు ఎక్కడా పేర్కొనలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం 15వ ఆర్థిక సంఘం నిధుల పారదర్శక వినియోగం, ఆన్‌లైన్ చెల్లింపుల సౌలభ్యం కోసం మాత్రమే డిజిటల్ సంతకాల విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. సంప్రదాయంగా కొనసాగుతున్న చెక్ విధానంలో ఉప సర్పంచ్ పాత్ర యథాతథంగానే ఉంటుందని స్పష్టతనిచ్చారు.

అందువల్ల ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దయ్యిందన్న వార్తలు అవాస్తవమని, అనవసర గందరగోళానికి తావివ్వకుండా అధికారిక ఉత్తర్వులను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు.

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this