సాయి కిరణ్ కు ఘన సన్మానం..

Published on

📰 Generate e-Paper Clip

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం

మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ–గంగన్న దంపతుల కుమారుడు సాయి కిరణ్ యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షల్లో ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. సాయి కిరణ్ సాధించిన ఈ ఘన విజయాన్ని గుర్తిస్తూ పొన్నారి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన సాయి కిరణ్ యువతకు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే విషయాన్ని ఆయన నిరూపించారని అభినందించారు. విద్య, పట్టుదల, లక్ష్య సాధనతోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.

సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొని సాయి కిరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో దేశ సేవలో కీలక బాధ్యతలు నిర్వహించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Latest articles

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు..

జర్నలిస్టులకు త్వరలో అక్రిడిటేషన్ కార్డులు: మంత్రి పొంగులేటి స్పష్టం మన భారత్, హైదరాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్ కార్డులు,...

కోడి గుడ్ల ధరలకు రెక్కలు..

కోడి గుడ్ల ధరలకు రెక్కలు… ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన రేట్లు మన భారత్, హైదరాబాద్: కోడి గుడ్డు ధరలు సామాన్యుడికి...

విజయోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి..

జామిడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం, విజయోత్సవ ర్యాలీకి సన్నాహాలు మన భారత్, ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో...

జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి..

జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి: PYL మన భారత్, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలో విద్యార్థుల...

More like this