అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు..

Published on

📰 Generate e-Paper Clip

అయ్యప్ప దీక్షలో స్నాన నియమాలు: భర్తతో పాటు భార్య ధర్మ బాధ్యతలు ఏమిటి?

మన భారత్, భక్తి: దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి మాల వేసుకొన్న స్వామి యొక్క ధర్మపత్నీ లేదా ఇంట్లో ఉన్న అమ్మ కూడా రెండు పూటలా తలారా చన్నిటి స్నానం చేయాలంటరా ఇది చాలామంది స్వాములకు ఉన్న ధర్మ సందేహం, దీని గురించి ఇప్పుడు తెలుసుకొందాం..

కేరళీయులు ఆడవాళ్ళు సైతం ప్రతినిత్యం రెండుపూటలు తలారస్నానం చేస్తారు. తలంటు స్నానమనగా బుధ, శుక్ర, శనివారాలలో తలకు నువ్వులనూనె రాసి కుంకుడుకాయ రసము, శీకాయపొడి, షాంపులాంటి వాటితో కేశములు పులిమి స్నానము చేసే దాన్ని తలంటు స్నానమంటారు. శిరస్సుపై జలము తగలక శరీరాన్ని మాత్రం స్నానం చేయించుట దీన్నే శరీరస్నానమంటారు. అనారోగ్య వంతులు, బాలింతలు, పసిపిల్లలు, వృద్ధులు శరీరస్నానం చేస్తారు. ఇంట్లో స్నానము చేసి దేవాలయాలకు వెళ్ళినపుడు అచ్చటి కోనేరు నదీలాంటిది వుంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఆలయ ప్రవేశం చేయాలి దీన్నే ‘పాదప్రక్షాళన స్నానం’ అంటారు. మనవాళ్ళు బయట నుండి ఇంట్లోకి ప్రవేశించే ముందుకూడ కాళ్ళు కడుక్కొనే లోనికి ప్రవేశిస్తారు. ఇది స్నానానికి సమానమన్నమాట. ప్రోక్షణస్నాన మనగా జలమును చేతిలో తీసుకొని శిరస్సుపై ప్రోక్షించు కొనుట. ఇది అతి సులభమైన స్నానం. ఎప్పుడైనా ఎక్కడైనా క్షణకాలములో చేయగల స్నానం. ఇదికూడ శాస్త్ర సమ్మతమే.

విభూతిస్నానం అనగా స్నానము చేయవలసిన వేళలో ఏ బస్సులోనో రైళ్ళ లోనో ప్రయాణము చేస్తుంటాం అలాంటి సమయంలో ప్రోక్షణానికికూడ జలం లేవనుకోండి అపుడు కాస్త విభూతిని నుదుట దిద్దుకొని ధరించియున్న ముద్రమాలలోని స్వామి అయ్యప్ప లాకెట్ ముందు పెట్టుకొని శరణాలు చెప్పుకొని పూజ చేసుకొనవచ్చు. ప్రయాణములో ఉన్నాంలే అని పూజను మానుకోరాదు కావున భస్మ ధారణ కూడ స్నానంగా అంగీకరించబడి ఉన్నది. ఎలా చూసినా స్నానమన్నది మానవ జీవితంలో విస్మరించలేని దినచర్య ఉన్నది మాత్రం నిర్వివాదాంశం.

దీక్షాకాలంలో శారీరక అనారోగ్య అత్యవసర సందర్భాలలో ఈ ఆరుస్నానాలలో ఏది ఆచరణ యోగ్యమో అది తమ గురువుగారి అనుమతితో వైద్యుల సలహా మేరకు పాటించుటలో దోషము లేదు.

అందుకని అందరు రెండుపూటల చన్నీటస్నానం కష్టమని ప్రోక్షణ స్నానం చేస్తే చాలని అయ్యప్ప ఆరాధనంలో వ్రాసియున్నారని చెబుతూ చన్నీటి స్నానం అనబడు ఆరోగ్యదాయకమైన ముఖ్య చర్యను మానుకోరాదు. ఆయా సందర్భాలకు తగు ఉపాయం మాత్రమే ఇది. వారి వారి మనస్సాక్షియే ఇందులకు అసలైన సాక్షి, ఇక స్త్రీల విషయానికి వస్తే ఈ ఆరు సూత్రాలు వారికి సర్వవేళలా ఆచరణ యోగ్యమే. అదియు పెద్దల ఆమోద అంగీకారమే కాస్త పసుపు కలిపిన నీరు తలపై ప్రోక్షించు కొంటే స్త్రీలు పుణ్య స్త్రీలౌతారని చెప్పబడియున్నది. నీటి కొరత వలననో, అస్వస్థత వలననో, తలతుడుచు కోవడానికి బద్దకించియో, నీటిలోని కాలుష్యానికి భయపడియో లేక సమయం లేకనో నేడు అనేక మహిళలు ప్రతినిత్యం తలార స్నానం చేయక, శరీర స్నానం మాత్రం చేసి వారానికోమారు తలంటు స్నానం చేస్తుంటారని వినికిడి. భర్త దీక్షలో యుండగా అలాచేయడం నేరమా? అలాంటి వేళలో వారికి మేము సేవచేస్తే దోషమున్నదా యని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

భర్త మాలధరించి దీక్ష తీసుకొంటే అతని భార్య మాల లేకనే ఆ దీక్షలో భాగ స్వామియై తీరుతుంది. భార్య సహకారం లేనిదే భర్త పవిత్రమైన మండలకాల బ్రహ్మచర్య దీక్షను పదిలంగా చేయలేడు. కావున పురుషులతో బాటు వారికి విధించియున్న విధులన్నియు స్త్రీలకు వర్తిస్తుంది. అపుడే ఆ దీక్షకు నిండుతనం వస్తుంది. సహజంగా భార్య, పిల్లలు, పెద్దలు అను కుటుంబ సభ్యుల మధ్యనుంటూ వికారములకు గురికాక మానసిక వైరాగ్యముతో మండల వ్రతమాచరించుటయే సరియైన పద్ధతి. దీనికి రెండు పూటల చన్నీటి స్నానం ఇరు వర్గీయులకు శ్రేయోదాయకమే.

అందుకని తలార చన్నీటి స్నానం రెండు పూటల చేయని మహిళలు మాలాధారులైన స్వాముల ఛాయలలోకి రాకూడదు. పూజా సామాగ్రులను ముట్టకూడదు. వారికి ఎలాంటి సేవలు చేయుటకు యోగ్యత లేదు అని శాసించుట అన్యాయమగును.

ప్రకృతి పరంగానే పురుషులకన్నా స్త్రీల శరీరం సున్నితమైనది. బలహీనమైనది, కార్తీక, మార్గశిర మాసములలో ఆచరించబడే ఈ దీక్షలో వేకువఝామున చలిలో చన్నీటి స్నానం అన్నది ఆరోగ్యవంతులైన పురుషులకే కష్టమనిపిస్తుంది అలా వుండగా సర్వబాధ్యతలను నెత్తి నేసుకొని ఇంట్లోని పనులన్నీచేసి అలసి సొలసి పోతున్న గృహిణులను వారికి వారే ఇష్టపడి చన్నీటి స్నానం చేస్తే తప్ప నిర్భంధించి చన్నీటి స్నానం చేయిస్తే తదుపరి వారికి వచ్చే శారీరక కష్టనష్టాలకు మనమే బాధ్యత వహించ వలసివస్తుంది. యాత్ర సమయంలోను శబరిమలలోను ఐస్ వంటి చల్లని నీటిలో స్నానము చేయవలసి వస్తుంది కనుక దీక్షాకాలంలో దీన్ని అలవాటు చేసుకొంటే యాత్రలో చన్నీటి స్నానం వలన శరీర వేధింపులుండదని దీక్షాదక్షులకు రెండు పూటల చన్నీటి స్నానం అను విధిని ఏర్పరచి ఉన్నారు. మంచి అలవాటుగా దలచి దీన్ని ఇష్టపడి ఆచరించే స్త్రీలను మిక్కిలి గౌరవిద్దాం. అలా వీలులేని వారిని పై చెప్పబడిన ఆరుస్నాన విధులలో సమయాను సారంగా ఏదో యొక స్నానాన్ని ఆచరింపజేసి దీక్షలో వారి సేవనందుకొని వారికి ఈ యాత్రా ఫలంలోని భాగాన్ని అందజేద్దాం. స్వామి శరణం..

స్వామి శరణం అయ్యప్ప…

Latest articles

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్ మన భారత్, తెలంగాణ: భూ భారతి సమస్యల పరిష్కారంలో జిల్లాల స్థాయిలో...

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

More like this

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్

అడిషనల్ కలెక్టర్ల లంచాల దందా..! సీఎం సీరియస్ మన భారత్, తెలంగాణ: భూ భారతి సమస్యల పరిష్కారంలో జిల్లాల స్థాయిలో...

మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలని సిపిఎం ధర్నా

ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరే కొనసాగించాలి: సిపిఎం ధర్నా మన భారత్, నాగర్ కర్నూల్: మహాత్మా గాంధీ...

కేజీబీవీ మెరిట్ లిస్ట్ విడుదల..!

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సవరించిన మెరిట్ లిస్ట్ విడుదల మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ...