హైకమాండ్ ఒక్క మాటతో క్లారిటీ: సిద్దరామయ్య వ్యాఖ్యలు రాజకీయాల్లో హీట్ పెంచాయి
మన భారత్, కర్ణాటక: కర్ణాటకలో సీఎం మార్పు చర్చలు మళ్లీ వేడి పుట్టిస్తున్న వేళ, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మార్పు వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లడం, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం సమంజసమేనని, అందుకు ఆంక్షలేమీ లేవని తెలిపారు.
అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని సిద్దరామయ్య వెల్లడించారు. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా స్పందిస్తూ.. “నేను పార్టీ నుంచి ఎటువంటి డిమాండ్స్ చేయలేదు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాను” అని అన్నారు.
తాజాగా వెలువడిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు మరోసారి ఆసక్తిని తెచ్చాయి. హైకమాండ్ తీర్పుపైనే రాబోయే రోజుల్లో కర్ణాటకలోని అధికార సమీకరణలు నిలవనున్నాయి.
