ఏలూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ ఏర్పాట్లు
మన భారత్, ఆంధ్రప్రదేశ్: డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో సోమవారం పర్యటించనుండటంతో జిల్లా అంతటా ఉత్సాహం నెలకొంది. ఉదయం 10 గంటలకు ఆయన రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం వైపు బయలుదేరుతారు.
అక్కడ కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రత్యేక దర్శనం చేసుకుని పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శంకుస్థాపన చేయనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. పవన్ పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాలు, గ్రామంలోని ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా బలగాలను మోహరించారు.
స్థానిక జనం, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పవన్ సందర్శన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనతో జిల్లాలో రాజకీయ చర్చలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి.
