రాష్ట్రంలో భారీ ఐపీఎస్ బదిలీలు: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియామకం
మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 32 మంది IPS అధికారులను బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు.
మౌనిక ఇటీవల వరకు దేవరకొండ ఏఎస్పీగా, కాజల్ సింగ్ ఉట్నూర్ ఎన్డీపీవోగా విధులు నిర్వహించారు. వారి పనితీరు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
నూతన నియామకాల ప్రకారం, ఇద్దరు అధికారులు తొందర్లోనే బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారులు వెల్లడించారు. జిల్లాల్లో చట్టవ్యవస్థ, పోలీసు వ్యవస్థ బలోపేతానికి ఈ మార్పులు సహాయపడతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
