ప్రజల గళం గట్టిగా వినిపిస్తే… BRS నుంచి అంతా కాంగ్రెస్లోకి వెళ్లిపోయే పరిస్థితి” – కవిత వ్యాఖ్యలు చర్చనీయాంశం
మన భారత్, రంగారెడ్డి: పెద్దవాడైనా, పేదవాడైనా ..తప్పు చేసిన వారికి చర్యలు తీసుకునే శక్తి హైడ్రాకు ఉండాలని జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన జనం బాట కార్యక్రమంలో ప్రజల సమస్యలు, హైడ్రా పాత్రపై ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
“ప్రజలు లేవనెత్తిన సమస్యలను హైడ్రా ముందు గట్టిగా ఉంచితే… BRS నుంచి MLAలు కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారేమో అనే డౌట్ వస్తోంది” అని కవిత వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేలా ప్రభుత్వ వ్యవస్థ పనిచేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.
అదే విధంగా, “ఇప్పుడు ఒక ఇల్లు కొనాలంటే హైడ్రా సర్టిఫికేట్ ఉంటే లొల్లీలేమీ ఉండవని ప్రజలు చెబుతున్నారు. ఇది వ్యవస్థపై నమ్మకం పెరిగిందనే సంకేతం” అని కవిత అన్నారు.
రంగారెడ్డి ప్రాంతంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులకు మరింత బలంగా తీసుకెళ్లడమేకాక, వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు.
