రాబోతున్న లెక్చరర్ నియామకాలు: వర్సిటీల్లో 4,300 పోస్టులు భర్తీకి సిద్ధం – మంత్రి లోకేశ్
మన భారత్, ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని వర్సిటీలలో ఖాళీగా ఉన్న 4,300 లెక్చరర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విద్యార్థి మరియు యువజన సంఘాల ప్రతి నిధులతో సమావేశమైన ఆయన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
విద్యాసంస్థల్లో క్రమశిక్షణ, విద్యా వాతావరణ పరిరక్షణపై దృష్టి పెట్టిన మంత్రి లోకేశ్, కాలేజీలు–వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. విద్యార్థులకు సమస్యలు, అభ్యర్థనలు చెప్పుకునేందుకు పనివేళల అనంతరం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యా ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగావకాశాల సృష్టి, పారదర్శక నియామకాలు ముఖ్య లక్ష్యాలని మంత్రి పేర్కొన్నారు.
