సినిమా పైరసీకి చెక్! ప్రత్యేక వింగ్‌పై ఆలోచనలో సీఎం రేవంత్
మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో సినిమాల పైరసీ రోజురోజుకూ ఆగ్రహం రేపుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. పైరసీని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక వింగ్‌ను ఏర్పాటు చేసే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాలను అదుపులో పెట్టేందుకు సమగ్ర వ్యూహం అవసరమని సీఎం ఇప్పటికే పోలీసు శాఖకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్, వెబ్‌సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ల ద్వారా జరిగే కాపీరైట్ ఉల్లంఘనలను అరికట్టేందుకు అధునాతన టెక్నాలజీతో ప్రత్యేక పోలీసు యూనిట్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇటీవల ఐబొమ్మ రవి అరెస్టు కేసును సైబర్ నేరాల విభాగం ఛాలెంజ్‌గా తీసుకొని కీలక ఆధారాలను సేకరించిన విషయం తెలిసిందే. ఈ కేసు రాష్ట్రంలో పైరసీ నెట్‌వర్క్‌లను పూర్తిగా కూలదోసే దిశగా కీలక మలుపు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.
పైరసీ అరికట్టడంలో ప్రభుత్వం తీసుకోబోతున్న కఠిన చర్యలు సినీ పరిశ్రమకు పెద్ద కొలిక్కి వచ్చేమో చూడాలి.
