బస్సు బోల్తా.. 42 మంది సజీవదహనం

Published on

-Advertisement-

సౌదీ అరేబియాలో విషాదం: యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా – 42 మంది సజీవదహనం

మన భారత్, హైదరాబాద్: సౌదీ అరేబియాలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. మక్కాలో ప్రార్థనలు ముగించుకుని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సు ముఫరహత్ సమీపంలో వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన కొన్ని క్షణాల్లోనే బస్సులో మంటలు చెలరేగి ఆవిరైపోయేంతలా దగ్ధమైంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 20 మంది మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో  హైదరాబాద్ వాసులు ఎక్కువ మంది ఉన్నట్లు నేషనల్ మీడియా నివేదికలు తెలియజేశాయి. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీములు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ, మంటల తీవ్రత కారణంగా ప్రాణాపాయం తప్పించలేకపోయారు. ప్రమాదానికి గల నిర్దిష్ట కారణాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.

ఈ దారుణ ఘటనతో హైదరాబాద్‌లోని కుటుంబాల్లో ఆర్తనాదాలు వెల్లువెత్తాయి. మృతుల వివరాలు సౌదీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.

Saudi Accident, Makkah Madina Bus Crash, Hyderabad Pilgrims, Saudi Road Accident, Manabharath.Com

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this