రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్

Published on

📰 Generate e-Paper Clip

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్
అచ్చంపేటలో బీఆర్ఎస్ జనగర్జన సభలో మండిపడ్డ కేటీఆర్

మన భారత్, నాగర్‌కర్నూల్ : “నల్లమల పులి కాదు.. నల్లమల నక్క!” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రానికి పెద్ద మనిషిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అప్పు పుట్టడం లేదని చెప్పటం సిగ్గుచేటు” అని విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందిస్తూ, “అతని మాటలు వింటుంటే నవ్వొస్తోంది. కాంగ్రెస్ మంత్రులకే తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందా లేదా అనే సందేహం ఉందంటే ప్రజలు ఎలా నమ్ముతారు?” అని ఎద్దేవా చేశారు.కేటీఆర్ అన్నారు ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంపును మేమే అడ్డుకున్నాం. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మళ్లీ ప్రయత్నిస్తే, ‘నల్లమల పులిబిడ్డ’ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఏం చేస్తారో చూద్దాం. దమ్ముంటే రాహుల్ గాంధీని చెప్పి కర్ణాటక సీఎంను పిలిపించి ఎత్తు పెంపును ఆపించండి. అలాగే, “మాజీ సీఎం కేసీఆర్ ఆల్మట్టి విషయంలో పులిలా గర్జించారు,  కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీకి భయపడి నోరు విప్పడం లేదు” అని కేటీఆర్ దుయ్యబట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూ,“ పెంచుతామని చెప్పిన పెన్షన్లు ఎక్కడ? మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎక్కడ? కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద తులం బంగారం ఏమైంది?” అని నిలదీశారు. “మోసపోతే గోస పడతామని కేసీఆర్ అప్పుడే చెప్పారు. రైతుల యూరియా సమస్య, సన్నవడ్ల బోనస్ అన్నీ బోగస్ అయ్యాయి.” అని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు బీఆర్ఎస్‌కి బ్రహ్మాస్త్రం అవుతుంది. ఇంటింటికీ పంపిణీ చేసి ప్రజలకు కాంగ్రెస్ వైఫల్యాలు చూపిస్తాం.” అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి తాము శంకుస్థాపన చేశామని గుర్తు చేస్తూ, “పాలమూరు–రంగారెడ్డి పథకం 90 శాతం పూర్తయింది. మిగిలిన పనులు చేయడానికి రేవంత్ రెడ్డికి చేతకావడం లేదు” అని వ్యాఖ్యానించారు. “ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి నేడు సీఎం కూర్చున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం” అని కేటీఆర్ విరుచుకుపడ్డారు. భవిష్యత్తులో అచ్చంపేటకు మంచి నాయకుడిని నియమిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సభకు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామారెడ్డి, నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు భారీగా హాజరయ్యారు.

— కృష్ణ చైతన్య, మన భారత్, స్టేట్ బ్యూరో .

Latest articles

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం

పల్లి (బి) సర్పంచ్ కటకం సంజీవ్‌కు ఘన సన్మానం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామ...

More like this

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా.? 

విద్యార్థుల సమస్యలపై పోరాడితే కేసులా?  సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తీవ్ర ఖండన మన భారత్, నారాయణపేట: విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...

ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌రాల కొనుగోలు చేస్తే తస్మాత్ జాగ్రత్త.!

మన భారత్, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ...

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ..

తుడుం దెబ్బ ఉపాధ్యక్షురాలు ఉయ్క ఇంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అంబుగాం ఉప సర్పంచ్ ఆత్రం భరత్.. మన భారత్,...