ఓబీసీ చైర్మన్‌ కృష్ణయ్యకు కీలక భాద్యతలు

Published on

-Advertisement-

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో రెహమత్నగర్ డివిజన్ ఇంచార్జ్‌గా గొల్ల కృష్ణయ్య నియామకం
నారాయణపేట జిల్లా ఓబీసీ చైర్మన్‌కు కీలక భాద్యతలు అప్పగించిన పార్టీ నేతృత్వం

మన భారత్, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న వేళ, బీఆర్ఎస్ పార్టీ నేతృత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నారాయణపేట జిల్లా ఓబీసీ చైర్మన్‌ శ్రీ గొల్ల కృష్ణయ్యను రెహమత్నగర్‌ డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది.

పార్టీ తరఫున బలమైన వ్యూహాలతో ఎన్నికల సమరాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. కృష్ణయ్య రాజకీయ ప్రస్థానంలో క్రమశిక్షణ, కృషి, సామాజిక సేవలకు పేరుగాంచిన నేతగా గుర్తింపు పొందారు. పార్టీ బలపర్చడంలో ఆయనకు ఉన్న అనుభవం, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నియామకంపై రెహమత్నగర్‌ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు కృష్ణయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నాయకత్వంలో పార్టీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు.

గొల్ల కృష్ణయ్య మాట్లాడుతూ “పార్టీ ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేస్తాను. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా అహర్నిశలు పని చేస్తాను” అని తెలిపారు.

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this