రూ.30 లక్షల మార్కెట్ యార్డు గోదాం నిర్మాణానికి శంకుస్థాపన

Published on

-Advertisement-

సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా భూమిపూజ చేసిన ఎంపీ గోడం నగేష్

తాంసీ, ఆగస్టు 29: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ గోడం నగేష్ తాంసీ మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మార్కెట్ యార్డు పరిధిలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి ఎంపీ గోడం నగేష్ శనివారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. రైతులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు అనుకూలమైన సదుపాయాలను కల్పించడం ఈ నిర్మాణం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మార్కెట్ యార్డు అభివృద్ధితో రైతులకు మరింత ప్రయోజనం కలగనుందని నాయకులు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాం అందుబాటులోకి రావడంతో రైతులకు పంటల నిర్వహణలో కొంత వెసులుబాటు లభించే అవకాశం ఉందన్నారు.

అదేవిధంగా మండల కేంద్రంలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా ఎంపీ గోడం నగేష్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో ప్రజల రాకపోకలకు సౌకర్యం మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి గంగాధర్ రావు, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ రైల్వే బోర్డు మెంబర్ జి.వి. రమణ, స్థానిక సర్పంచ్ అరుణ్, నాయకులు సామ సంతోష్ రెడ్డి, జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు బోండ్ల వెంకటస్వామి, కనపర్తి చంద్రకాంత్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీకి స్వాగతం పలికారు. అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు సంబంధిత అధికారులను కోరారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించాలి..

గ్రీవెన్స్ డేలో 23 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి త్వరితగతిన పరిష్కరించాలని...

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల పాటు 30 పోలీస్ యాక్ట్ అమలు అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులకు...

యూనిఫాంలు పంపిణీ చేసిన సర్పంచ్ వెంకన్న ..

కుచులాపూర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను విద్యార్థులకు అందజేసిన సర్పంచ్ మోడెపు వెంకన్న తలమడుగు:మన...

హల్వానిలో శుద్ధికరణపై పోలీసులకు ఫిర్యాదు

హల్వానిలో శుద్ధికరణ కార్యక్రమంపై పోలీసులకు ఫిర్యాదు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర వర్తించే చట్టాల కింద కేసు...

More like this