సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి: కలెక్టర్

Published on

-Advertisement-

మన భారత్ | ఆదిలాబాద్

ఆదిలాబాద్ ప్రజావాణిలో 97 అర్జీలు.. గడువులోగా పరిష్కారానికి కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు

ఆదిలాబాద్, జూలై 27 (మన భారత్): ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులోగా ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా మొత్తం 97 అర్జీలు అందినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా, సంబంధిత శాఖలు వెంటనే పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సూచించారు.

ప్రజావాణి ద్వారా వచ్చిన సాధారణ ఫిర్యాదులను 30 రోజుల లోపు, అప్పీల్‌కు సంబంధించిన కేసులను మూడు రోజుల వ్యవధిలో పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అలాగే, ఒకే సమస్య పదేపదే ప్రజావాణికి రాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం ఉండేలా అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా ఈ సందర్భంగా ఆదేశించారు.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు, మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this