ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతి

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు

లక్ష్మీపూర్ పివిటీజీలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి సమస్యలు వివరించిన గ్రామస్తులు

తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (PVTGs) కుటుంబాల సమస్యలను పరిష్కరించి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, లక్ష్మీపూర్ గ్రామంలోని పివిటీజీ కుటుంబాలు అనేక సంవత్సరాలుగా ప్రాథమిక వసతుల కొరతతో పాటు గృహ సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా నివాస గృహాలు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, పివిటీజీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. లక్ష్మీపూర్ గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్‌కు వెంటనే లేఖ అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చివరి వ్యక్తికి చేరేలా కృషి చేస్తామని, పివిటీజీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

పివిటీజీ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు గృహ వసతి, తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య సేవలు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే స్పందనపై వారు హర్షం వ్యక్తం చేస్తూ, తమ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీపూర్ సర్పంచ్ రాధ మనోహర్, గ్రామానికి చెందిన పివిటీజీ కుటుంబాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

ఆదిలాబాద్ జిల్లాలో మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

కేసీఆర్ కుటుంబంపై మెరుగు సురేష్ గౌడ్ ఫైర్ 

మొగుళ్ళపల్లి సెప్టెంబర్ 21, (మన భారత్): తెలంగాణ ఉద్యమ సమయంలో పెట్రోలుకు, డీజిల్ కు కూడా పైసలు లేవన్న వాళ్లు,...

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

51 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ ప్రకటించాలి.. పెండింగ్‌ డీఏలు విడుదల చేయాలి: తపస్‌ జిల్లా అధ్యక్షుడు సునీల్‌...

విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి బోధనోపకరణాలు దోహదం

తలమడుగులో మండల స్థాయి బోధనోపకరణాల మేళా తహసీల్దార్ బి. రాజమోహన్ మన భారత్, తలమడుగు, సెప్టెంబర్ 21: విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా...

త్రిషల్ గణేష్ మండలిలో ప్రత్యేక పూజలు..

మన భారత్, సెప్టెంబర్21, మావల: మావలలోని త్రిషల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయకుడిని ఆదిలాబాద్ మార్కెట్...

More like this