e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

డిపో మేనేజర్‌గా సాయన్న బాధ్యతలు..

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న బాధ్యతల స్వీకరణ

ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం – నూతన డిపో మేనేజర్

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోకు నూతన డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ ఆర్టీసీ డిపో నుంచి బదిలీపై వచ్చిన ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టి డిపో సిబ్బంది, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిపోలో అమలవుతున్న సేవలు, ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

గతంలో ఆదిలాబాద్ డిపో మేనేజర్‌గా విధులు నిర్వహించిన ప్రతిమారెడ్డి ఆర్మూర్ డిపోకు బదిలీ కావడంతో ఆమె స్థానంలో సాయన్న నియమితులయ్యారు. రవాణా రంగంలో విస్తృత అనుభవం కలిగిన సాయన్న పలు డిపోల్లో సమర్థవంతమైన పరిపాలన అందించి మంచి గుర్తింపు పొందినట్లు సహచర అధికారులు తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన డిపో మేనేజర్ సాయన్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించే అంశంపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రయాణికులకు సకాలంలో బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించడం ఆర్టీసీ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవల విస్తరణ, బస్సుల సమయపాలన, సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

నూతన డిపో మేనేజర్ సాయన్న మాట్లాడుతూ, ఆదిలాబాద్ డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. బస్సుల సమయపాలన, సిబ్బంది సమన్వయం, ప్రయాణికుల భద్రత, సౌకర్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.

అలాగే ఆర్టీసీ ఆదాయ వృద్ధి, ప్రయాణికుల సంఖ్య పెంపు, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన కోసం వినూత్న చర్యలు చేపడతామని వెల్లడించారు. ఆర్టీసీ సేవలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా సిబ్బందితో కలిసి పనిచేస్తానని తెలిపారు.

జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో నూతన డిపో మేనేజర్ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు, సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE