e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు

కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తి, జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశ అభ్యున్నతి, ప్రజల సంక్షేమం, శాంతి భద్రతల కోసం కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఈ పూజా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపెల్లి రాజు మాట్లాడుతూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE