Jio.. 52 కోట్లకు పైగా వినియోగదారులు

Published on

-Advertisement-

ఒక్కో యూజర్ నెలకు సగటున 42.3GB డేటా వినియోగం

5G సేవల్లో జియో ఆధిపత్యం కొనసాగుతోందన్న రిలయన్స్

మన భారత్ | ఇంటర్నేషనల్

దేశంలోని టెలికాం రంగంలో జియో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతదేశంలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 524 మిలియన్లు (52.40 కోట్లకు పైగా) చేరిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గవ త్రైమాసిక (Q4) ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఈ వివరాలను ప్రకటించింది.

రిలయన్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం జియోకు 26.8 కోట్ల మంది 5G వినియోగదారులు ఉన్నారు. వేగవంతమైన ఇంటర్నెట్ సేవలతో పాటు డిజిటల్ రంగంలో విస్తరణ కొనసాగిస్తున్న జియో, ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా 2.71 కోట్ల ఇళ్లకు చేరువైనట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు జియో నెట్‌వర్క్ విస్తరణ వేగంగా కొనసాగుతోందని కంపెనీ పేర్కొంది.

అలాగే ప్రతి వినియోగదారుని నుంచి సగటున నెలకు రూ.214 ఆదాయం వస్తోందని కంపెనీ వెల్లడించింది. మరోవైపు ఒక్కో యూజర్ నెలకు సగటున 42.3 జీబీ డేటా వినియోగిస్తున్నట్లు పేర్కొంది. పెరుగుతున్న డిజిటల్ వినియోగం, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ విద్య, వర్క్ ఫ్రం హోమ్ వంటి కారణాలతో డేటా వినియోగం భారీగా పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

5G సేవల విస్తరణలో జియో ముందంజలో ఉందని, రాబోయే రోజుల్లో మరింత వేగంగా నెట్‌వర్క్ విస్తరణ చేపట్టనున్నట్లు కంపెనీ సంకేతాలు ఇచ్చింది. టెలికాం రంగంలో జియో వృద్ధి ఇతర కంపెనీలకు గట్టి పోటీగా మారుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి: మంత్రి

2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి.. శాస్త్రీయ డిజైన్లతో పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన భారత్,...

ఆ చెత్తను వెంటనే తొలగించాలి..

అంబేద్కర్ చౌక్–కిసాన్ చౌక్ డివైడర్లపై పేరుకుపోయిన చెత్త.. వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త ప్రేమకళ మన భారత్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా...

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా 

బ్రహ్మా ముహూర్తం.. మీకు తెలుసా  మన భారత్, ఇంటర్నెట్ డెస్క్:  ఈ పదాన్ని మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ.....

ప్లాస్టిక్ రహిత శిక్షణకు శ్రీకారం..

స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయులు మన భారత్, నారాయణపేట, జూలై 20: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు...

More like this